Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తనకి సంబంధించిన ఫొటోలని షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఉత్సాహపరుస్తుంది. తాజాగా రూమర్ బాయ్‌ఫ్రెండ్ రాజ్ నిడిమోరుతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది సామ్. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింటే వైరల్ అవుతున్నాయి. దీంతో మరోసారి వారి రిలేషన్ గురించి చర్చ నడుస్తుంది. త్వరలో వీరిరివురు పెళ్లి చేసుకోవడం ఖాయమా అనే చర్చ జరుపుతున్నారు. కొన్నాళ్లుగా సమంత-రాజ్ ఎక్కువగా కలిసి కనిపిస్తున్నారు. ఇప్పుడు దీపావళికి ఈ ఇద్దరు ఒకే చోట కనిపించడంతో వారిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందని కామెంట్ చేస్తున్నారు.
సమంత తన అందం, అభినయం, నటన ద్వారా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. ‘ఏమాయ చేశావే’ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సామ్, మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మాయ చేసింది. ఆ తరువాత వరుసగా సినిమాలు చేసి, అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది.వ్యక్తిగత జీవితంలో సవాళ్లను ఎదుర్కొన్న సమంత, నాగచైతన్యతో డివోర్స్, హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడి, ఇప్పుడు కెరీర్లో మళ్లీ బిజీ అయింది. నటిగానే కాకుండా ప్రొడ్యూసర్‌గా కూడా సత్తా చాటుతుంది. సమంత హీరోల సినిమాల్లో నటించడమే కాకుండా యాక్షన్ చిత్రాలు, లేడీ ఓరీయెంటెడ్ సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకుంది. అడపాదడపా వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ తన టాలెంట్ నిరూపించుకుంటుంది.
గత కొంతకాలంగా సమంత-రాజ్ నిడిమోరు జంట ఇంటర్నెట్లో హాట్ టాపిక్ అవుతున్నారు. ఈ మధ్య రాజ్‌తో సమంత సన్నిహితంగా కనిపించడం, తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు కలసి వెళ్లడం, ‘శుభం’ సక్సెస్ సెలబ్రేషన్లో కలిసి హాజరవడం చూసి ఇద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడిందనే అభిప్రాయం అందరిలో కలుగుతుంది. ఇటీవల అయితే సమంత భుజంపై అతను చేయి వేసి నడవగా, మరో ఫొటోలో ఇద్దరు పక్కపక్కన కూర్చొని చాలా హ్యాపీ మూడ్‌లో కనిపించారు. అనంతరం ఒకే కారులో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు కలిసి వారిద్దరు దీపావళి సెలబ్రేట్ చేసుకోవడం చూస్తే.. త్వరలోనే వారి రెండో పెళ్లి ఉంటుందంటూ అంటూ జోస్యాలు చెబుతున్నారు.