Samantha | మళ్లీ పెళ్లి గురించి సమంత ఏమన్నదో తెలుసా..?
Samantha | వైవాహిక జీవితంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ప్రొఫెషనల్ కెరీర్‌పై ఫోకస్ పెట్టింది చెన్నై సుందరి సమంత (Samantha). సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ భామ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్లో పాల్గొన్నది. ఓ ఫాలోవర్ను సమంతను మళ్లీ పెళ్లి గురించి అడిగింది.
Samantha | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో టాప్‌లో ఉంటుంది చెన్నై సుందరి సమంత (Samantha). వైవాహిక జీవితంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ప్రొఫెషనల్ కెరీర్‌పై ఫోకస్ పెట్టింది సామ్. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ భామ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్లో పాల్గొన్నది. ఓ ఫాలోవర్ను సమంతను మళ్లీ పెళ్లి గురించి అడిగింది. ఫాలోవర్లకు ప్రశ్నకు సమంత చాలా కూల్‌గా, కొంచెం ఫన్‌గా సమాధానమిచ్చింది.
మొదటి పెళ్లి, రెండో పెళ్లి, మూడో పెళ్లి విషయాల్లో విడాకులు తీసుకునే వారి శాతం ఎలా ఉంటుందో గణాంకాల రూపంలో వెల్లడించింది. గణాంకాల ప్రకారం చూస్తే.. మళ్లీ పెళ్లి అనేది అనవసర పెట్టుబడి (నవ్వుతూ) అంటూ రిప్లై ఇచ్చింది. 2023 వరకు తీసుకుంటే మొదటి పెళ్లి చేసుకున్న వారిలో విడాకులు తీసుకునే వారిలో 50శాతం వరకుండగా.. రెండు, మూడో పెళ్లిళ్లలో విడాకులు తీసుకునే వారి (స్త్రీలు, పురుషులు) శాతం 67 శాతం, 73 శాతంగా ఉందని చెప్పుకొచ్చింది.
ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన సామ్ ఇక నుంచి తనలోని నిర్మాతను కూడా అందరికీ పరిచయం చేసేందుకు రెడీ అయింది. ఇటీవలే సొంత నిర్మాణ సంస్థ Tralala Moving Picturesను లాంఛ్ చేసిందని తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రకటిస్తూ ఓ వీడియో షేర్ చేసింది. నా ప్రొడక్షన్ హౌస్‌ని ప్రకటించినందుకు సంతోషిస్తున్నా. సామాజిక అంశాలు, వాటి సంక్లిష్టత గురించి మాట్లాడే కథలను ఆహ్వానించే, వాటిని ప్రోత్సహించే ప్లాట్‌ఫాం ఇది. చిత్రనిర్మాతలు అర్థవంతమైన, ప్రామాణికమైన, విశ్వవ్యాప్తమైన కథలను చెప్పడానికి ఒక వేదిక.
కొత్త తరం ఆలోచనలు, భావోద్వేగాలను ప్రతిబింబించే కంటెంట్‌ను అందించడమే Tralala Moving Pictures ఉద్దేశం. నాకు ఇష్టమైన పాటల్లో ఒకదాని నుండి ప్రేరణ పొందిన.. బ్రౌన్ గర్ల్ ఇప్పుడు పోటీలో ఉంది.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది సామ్. సామ్ ప్రస్తుతం బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధవన్‌తో కలిసి సిటడెల్ (Citadel) వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. మరోవైపు అమెరికన్ ఫిల్మ్ చెన్నై స్టోరీస్‌లో కూడా నటిస్తోంది.

Samantha
హోం ప్రొడక్షన్ హౌస్ వివరాలివే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

