Samajavaragamana Movie | ఫలితం ఎలా ఉన్నా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకోవడంలో శ్రీవిష్ణు ముందు వరుసలో ఉంటాడు. జయాపజాయలతో సంబంధంలేకుండా ప్రేక్షకులకు కొత్త తరహా కథలను పరిచయం చేస్తుంటాడు. కెరీర్ మొదటి నుండి శ్రీవిష్ణు విభిన్న జానర్లో సినిమాలను చేస్తున్న కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోతున్నాడు. కాగా గతేడాది ఆయన నటించిన ‘అల్లూరి’ విడుదలై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయింది. ప్రస్తుతం శ్రీవిష్ణు ‘వివాహా భోజనంబు’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో సామజవరగమన అనే రొమ్-కామ్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది.
కాగా తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ఓ వీడియోను రిలీజ్ చేసింది. సినిమాలు లేకుండా సమ్మర్ పూర్తి కాదు. పైగా అందరికీ నచ్చే సీజన్ సమ్మర్. స్కూల్స్, కాలేజీలు గట్రా ఉండవు. కాబట్టి మే 18న అంటే మరో 30 రోజుల్లో సినిమా మీ ముందుకు వచ్చేస్తుంది అంటూ శ్రీవిష్ణు వీడియోలో వెల్లడించాడు. ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ ఈ సినిమాను నిర్మించాడు. గోపి సుందర్ స్వరకల్పనలో రూపొందిన ఈ సినిమాలో విష్ణుకు జోడీగా బిగిల్ ఫేమ్ రెబా మోనికా జాన్ నటిస్తుంది.