నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత విహారయాత్రలకు బయలుదేరింది. తన స్నేహితురాలితో కలిసి ప్రత్యేకంగా డెహ్రాడూన్ లో విహారానికి వెళ్లిన సమంత బన్నీ కూతురు అర్హపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం
చిత్రంతో అల్లు అర్హ వెండితెరకు బాలనటిగా పరిచయం అవుతుంది .ఈ చిత్రంలో అల్లు అర్హ నటనకు ముగ్ధురాలైన సామ్ తనపై ప్రశంసల వర్షం కురిపించింది.
`అల్లు అర్హ జన్మతః రాక్ స్టార్ గా పుట్టిందని..తన తొలి స్టెప్ లోనే మంచి మార్గాన్ని ఎంచుకుందని.. అలాంటి అర్హ నా సినిమా ద్వారా నటిగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా వుందని పేర్కొంది సమంత. భవిష్యత్తులో అల్లు అర్హ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతుందని స్టార్ కిడ్ ఫ్యూచర్ ని చెప్పేసింది సామ్. అర్హ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, చిత్రంలో యువరాజు భరతుడిగా కనిపించబోతోంది అర్హ.
ఇండస్ట్రీలో ఎందరినో బాలనటులుగా పరిచయం చేసిన సీనియర్ దర్శకులు గుణశేఖర్ అర్హను కూడా తెరకు పరిచయం చేస్తున్నారు. వారం పదిరోజుల పాటు అర్హపై చిత్రీకరణ సాగింది. అర్హకు ఎలాంటి కష్టం లేకుండా ఫాల్కన్ బస్
ని అల్లు అర్జున్ ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా, పురు రాజవంశం రాజు దుష్యంతుల జీవితం ఆధారంగా రూపొందుతున్న పౌరాణిక డ్రామా శాకుంతలం. సమంతతో పాటు మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్టంతగా కీలక పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఇది కూడా చూడండి