Salman Khan | బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రం ‘సికందర్’. ఈ మూవీ ఈ నెల 30న విడుదల కానున్నది. మూవీ ప్రమోషన్స్‌లో సల్మాన్ పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువ హీరోయిన్లు జాన్వీ కపూర్, అనన్య పాండేతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నానని తెలిపాడు. అయితే, వయసు వ్యత్యాసం కారణంగా అందరూ తనను విమర్శించే ఛాన్స్ ఉందని వ్యాఖ్యానించారు. ఓ కార్యక్రమంలో సల్మాన్ మాట్లాడుతూ యువ హీరోయిన్లతో కలిసి పని చేసేది వారికి పెద్ద వేదిక, అవకాశాలు ఇవ్వడానికి మాత్రమేనన్నారు.
తాను అనన్య, జాన్వీతో కలిసి పని చేయాలనుకుంటే తనను జనం ఇబ్బందిపడుతారని.. వయసు వ్యత్యాసం గురించి మాట్లాడుతారని.. అయినా వారితో కలిసి పని చేస్తానని చెప్పాడు. గతంలో చాలామంది నటులతో కలిసి ఏదైనా చేయాలని ఓ నిర్మాతకు సూచించాననని.. కానీ, ప్రస్తుత జనరేషన్ ఒకరితో ఒకరు కలిసి పని చేసేందుకు నిరాకరించినట్లు చెప్పాడు. మల్టీస్టారర్ సినిమాలు చేయడం సౌకర్యవంతంగా ఉంటుందని.. ఎందుకంటే అభిమానలంతా కలిసి వచ్చి సినిమాను హిట్ చేసినట్లుగా ఉంటుందన్నారు. తాము 100-200 రోజులు పని చేసిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తున్న సికిందర్ మూవీని పెన్ స్టూడియో బ్యానర్‌పై సాజిత్ నదియవాలా నిర్మిస్తున్నారు.
రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. కాజల్ అగర్వాల్ కీలకపాత్రలో కనిపించనున్నది. ఏఆర్ మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే, గత కొద్దిరోజుల ఈ మూవీలో రష్మికకు సల్మాన్ తండ్రిలా ఉన్నాడని, ఇద్దరి మధ్య 31 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉందని పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ట్రోల్స్‌పై సల్మాన్ స్పందించాడు. ఏజ్ గ్యాప్ విషయంలో రష్మికు ఎలాంటి ఇబ్బంది లేదని.. ఆమె తండ్రికి కూడా లేని సమస్య మీకెందుకు అంటూ ప్రశ్నించారు. రష్మికకు పెళ్లయినా వదిలిపెట్టకుండా సినిమాలు చేస్తానని.. ఆమెకు కూతురు పుట్టినా ఆమెతో నటిస్తానంటూ ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.