Salaman Khan | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో అశేష ప్రేక్షకాదరణ పొందాడు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న సల్మాన్ ఖాన్ కు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం ఉండదు. 3 దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్న సల్లూ భాయ్.. యంగ్ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తున్నారు. రీసెంట్గా సికిందర్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం మిశ్రమ స్పందన సంపాదించుకుంది. చిత్రంలో రష్మిక కథానాయికగా నటించింది. ఇద్దరి మధ్య 31 ఏళ్ల ఏజీ గ్యాప్ ఉన్నప్పటికీ వెండి తెరపై మాత్రం వీరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది.
59 ఏళ్లు ఉన్న సల్మాన్ ఖాన్ ఇప్పటికీ ఫిట్‌గానే ఉన్నాడు. అయితే కొందరు ట్రోలర్స్ సల్మాన్ ఖాన్ ఫిట్‌గా లేరంటూ ట్రోల్ చేశారు. ఆ ట్రోలర్స్‌కి బుద్ది చెప్పేందుకు మొన్నామధ్య చెట్టు ఎక్కారు. ఇక తాజాగా అయితే జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఫొటో ఒకటి పోస్ట్ చేశారు. దీనికి కామెంట్‌గా నాలో ఈ స్పూర్తిని నింపుతున్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు అని రాసుకొచ్చాడు. అయితే సల్లూభాయ్‌ని ఇలా చూసి ఫ్యాన్స్ అయితే మైమరచిపోతున్నారు. ఈ వయస్సులోను ఇంత ఎనర్జిటిక్‌గా ఎలా ఉండగలుగుతున్నావ్ అంటూ కొందరు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు ఇటీవల డెత్ వార్నింగ్ లు ఎక్కువగా వస్తున్నాయి. మరణ హెచ్చరికలు గ్యాంగ్ స్టర్స్ నుంచి రావడంతో బాయ్ జాన్ తన జాగ్రత్తలో తను ఉంటున్నాడు.అయితే గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ కు తరుచుగా బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ వారు బహిరంగంగా హెచ్చరికలు పంపుతున్నారు. అయితే రీసెంట్గా కూడా ఓ డెత్ వార్నింగ్ వచ్చింది. ముంబైలోని వర్లీ ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ వాట్సాప్ నెంబర్ కు గుర్తు తెలియని నెంబర్ నుంచి మెసేజ్ రాగా, అందులో సల్మాన్ ఖాన్ పై ఎటాక్ చేయబోతున్నామంటూ హెచ్చరించారు. సల్మాన్ ఖాన్ ఇంట్లో చొరబడి మరీ కాల్పులు జరుపుతామని లేదంటే సల్మాన్ కారులోనైనా బాంబు పెట్టి పేల్చుతామని, ఎలాగైనా లేపేస్తామని హెచ్చరించారు. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తం అయ్యారు.