ముంబై : కండల వీరుడు సల్మాన్ ఖాన్.. కొత్త మూవీకి రెడీ అయ్యాడు. బ్యాటిల్ ఆఫ్ గల్వాన్(Battle of Galwan) ఫిల్మ్‌లో అతను నటిస్తున్నాడు. ఆ ఫిల్మ్‌కు చెందిన ఫస్ట్ పోస్టర్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఆ లుక్‌లో ముఖంపై రక్తం, ఇనుప వైర్‌తో ఉన్న కర్రెను చేతిలో పట్టుకున్నాడు. గల్వాన్ లోయలో ఇండియా, పాకిస్థాన్ జవాన్ల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంతో చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిసింది. గల్వాన్ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సైనికులు రాళ్లు, బోర్డర్‌ను రక్షించే ఉద్దేశంతో చైనీస్ ఆర్మీతో మన సైనికులు తీవ్రంగా పోరాడారు. ఆ కథాంశంతో బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ చిత్రాన్ని తీస్తున్నట్లు తెలుస్తోంది. అపూర్వ లఖియా ఈ చిత్రానికి డైరక్షన్ వహిస్తున్నారు.
వార్ డ్రామాలో సల్మాన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సల్మాన్ తన లుక్కు చెందిన ఓ ఫోటోను షేర్ చేశాడు. చాలా సన్నగా, ఫిట్‌గా ఉన్న ఫోటోను అతను పోస్టు చేశాడు. సల్మాన్ చివరిసారి ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో రిలీజైన సికందర్ చిత్రంలో నటించాడు. ఆ ఫిల్మ్ బాక్సాఫీసు వద్ద పెద్దగా వసూల్ చేయలేదు.