Salman Khan | బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్ ఇంట్లో జరిగిన గణపతి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చెప్పులు లేకుండా పూర్తి భక్తిభావంతో పూజలు నిర్వహించడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. సోమవారం సాయంత్రం షెలార్ ఇంటికి వెళ్లిన సల్మాన్ గణేశుడికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా.. ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సల్మాన్ ఖాన్ తన కుటుంబంతో కలిసి ప్రతి సంవత్సరం గణేశ్ చతుర్థి వేడుకలను ఘనంగా జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. తన సోదరి అర్పితా ఖాన్ శర్మ ఇంట్లో కూడా గణపతిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈసారి కూడా ఆయన ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు.
మరోవైపు ఇటీవల సల్మాన్ ఖాన్కు ప్రాణహాని ఉందని వార్తలు రావడంతో ప్రభుత్వం ఆయనకు Z+ కేటగిరీ భద్రతను కల్పించింది. గణపతి ఉత్సవాలకు కూడా ఆయన భారీ భద్రత మధ్య వచ్చారు. ఈ వార్త సల్మాన్ ఖాన్ పండుగల్లో పాల్గొని, భక్తిని ప్రదర్శిస్తూ, సామాన్య ప్రజల మాదిరిగానే ప్రవర్తించడం అభిమానులను ఆకట్టుకుంది.
अभिनेते सलमान खान यांनी आमच्या वांद्रे पश्चिम सार्वजनिक गणेशोत्सव मंडळाच्या गणरायाचे दर्शन घेतले.#GanpatiBappaMorya #Ganeshotsav #AshishShelar pic.twitter.com/LNRyE4qjNN
— Adv. Ashish Shelar – ॲड. आशिष शेलार (@ShelarAshish) September 1, 2025