Salman Khan | తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేసిన ‘జవాన్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడంతో ఇప్పుడు బాలీవుడ్ అగ్ర హీరోలు తమిళ దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అగ్ర హీరో సల్మాన్‌ఖాన్ అయితే వరుసగా ముగ్గురు తమిళ డైరెక్టర్స్‌ను లైన్లో ఉంచారు. ప్రస్తుతం ఆయన ‘సికిందర్’ చిత్రంలో నటిస్తున్నారు. మురుగదాస్ దర్శకుడు. దీని తర్వాత అట్లీ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్ ఓ సినిమా చేయబోతున్నారని తెలిసింది.
తాజా సమాచారం ప్రకారం సల్మాన్‌ఖాన్ మరో తమిళ దర్శకుడు విష్ణువర్ధన్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ చిత్రానికి ‘ది బుల్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని సమాచారం. పూర్తిగా స్పెయిన్‌లో చిత్రీకరించబోతున్న ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటించనుందని చెబుతున్నారు. ఈ సంవత్సరాంతంలో షూటింగ్ మొదలుపెట్టనున్నారని తమిళ ఫిల్మ్ వర్గాల సమాచారం.