Salman Khan | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన షర్ట్ లేని ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. 59 ఏళ్ల వయసులో కూడా ఆయన కండలు, సిక్స్ ప్యాక్ ప్రదర్శిస్తూ కనిపించడంతో అభిమానులు షాక్‌కి గురవుతున్నారు. సల్మాన్ ఖాన్ తన అద్భుతమైన ఫిజిక్‌ను చూపిస్తూ షేర్ చేసిన ఈ ఫొటోలకు కామెంట్ల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ సినిమాను గుర్తు చేస్తూ అభిమానులు టైగర్ జిందా హై (Tiger Zinda Hai) అని ట్రెండింగ్ చేస్తున్నారు. మరోవైపు ఇండియాకు ఫిట్నెస్ ఐకాన్ సల్మాన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
సల్మాన్ ఖాన్ తన రాబోయే చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ (Battle of Galwan) కోసం సిద్ధమవుతున్నట్లు ఈ ఫొటోలు చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ ఫొటోలకి సల్మాన్ రాసుకోస్తూ.. ”కొన్ని సాధించాలంటే మరికొన్ని వదులుకోవాలి… కానీ ఇది వదులుకోకుండానే వచ్చింది” (Kuch haasil karne ke liye kuch chhodna padta hai.. Yeh bina chhode hai.) అనే క్యాప్షన్‌ని జోడించాడు.
Kuch haasil karne ke liye kuch chhodna padta hai.. Yeh bina chhode hai. pic.twitter.com/4oyIWYRS83
— Salman Khan (@BeingSalmanKhan) November 3, 2025