Salman Khan | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ వయస్సులోను కుర్ర హీరోలతో పోటీ పడుతూ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్నాడు. ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకి పండగ. ఇప్పుడు రంజాన్ సందర్భంగా సికందర్ అనే మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో వరుస హిట్స్‌తో ఫామ్‌లో ఉన్న రష్మిక మంధాన కథానాయికగా నటిస్తుది. కలువ కళ్ల సుందరి కాజల్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. గత కొద్ది రోజులుగా సల్మాన్ ఖాన్ సికందర్ మూవీ ప్రమోషన్స్‌తో చాలా బిజీగా ఉన్నాడు.
అయితే ఈ క్రమంలోనే ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ జాకబ్ & కో. ఎపిక్ ఎక్స్ రామ్ జన్మభూమి టైటానియం ఎడిషన్ 2 వాచ్‌ను ధరించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అద్భుతమై డిజైన్, ఆకర్షణీయమైన హస్త కళతో కూడిన ఈ వాచ్ ధర దాదాపు రూ.34 లక్షలు ఉంటుందని తెలుస్తుంది. జాకబ్ & కో వ్యవస్థాపకుడు- ఛైర్మన్ జాకబ్ అరాబోతో సల్మాన్ కుటుంబానికి గొప్ప అనుబంధం నేపథ్యంలో ఈ బాలీవుడ్ హీరో కొన్నేళ్లుగా ఈ కంపెనీ వాచ్ లను ధరిస్తూ వాటికి కావల్సిన ప్రచారం కల్పిస్తున్నాడు. సినిమాల ద్వారా కూడా సల్మాన్ ఖాన్ ఈ వాచ్‌లని ప్రమోట్ చేస్తున్నాడు.
జాకబ్ అండ్ కో కంపెనీ అధినేతతో సల్మాన్ బంధం ఎప్పటితో ఉంది. వారిద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. ఓ సందర్భంలో జాకబ్ తండ్రి సల్మాన్ కి ఒక కానుక ఇచ్చాడు. ది వరల్డ్ ఈజ్ యువర్స్ థీమ్ తో ఇది ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.. అప్పటి నుంచి వారి బంధం మరింత బలపడింది. సల్మాన్ జీవితంపై ఎంతో ప్రభావం చూపించిన అతడి తండ్రి సలీంఖాన్ ని గౌరవించే ఒక ప్రత్యేకమైన టైమ్‌పీస్‌ను రూపొందించడంలోను జాకబ్ అండ్ కో ఎంతో సహకరించింది. సల్మాన్ కోసం, అతడి తండ్రి కోసం ప్రత్యేకమైన వాచ్ లను ఈ కంపెనీ తయారు చేసి అందిస్తుంది. ప్రస్తుతం సల్మాన్ భాయ్ ధరించిన రామ మందిరం డిజైన్ వాచ్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.