Singham 3 | బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి (Rohit Shetty), అజయ్ దేవ్‌గణ్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం సింగం అగైన్ (Singham Agian). బ్లాక్ బస్టర్ ‘సింగం’(Singham) ఫ్రాంచైజీకి బాలీవుడ్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అజయ్ దేవ్‌గణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలు కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్ రాబోతుంది. సింగం అగైన్ (Singham Agian) అంటూ వస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. కరీనా కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కాస్ట్ నటించబోతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ మూవీలో దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్, రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, అర్జున్ కపూర్, జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ నటించబోతున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. సల్మాన్ ఐకానిక్ రోల్ అయిన దబాంగ్ (Dabangg) సినిమాలోని చుల్బుల్ పాండే (Chulbul Pandey) పాత్రలో సింగం (Singham) సినిమాలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే సల్మాన్ ఫ్యాన్స్‌కు పండగా అని చెప్పుకోవాలి. ఎందుకంటే సల్మాన్ బ్లాక్ బస్టర్ సినిమాలలో దబాంగ్ కూడా ఒక్కటి. ఆ మూవీలో చుల్బుల్ పాండే పాత్రలో సల్మాన్ ఖాన్ గెటప్, స్వాగ్, కామెడీ టైమింగ్ ఒక రేంజ్లో అలరించాయి. అయితే అదే పాత్ర మళ్లీ సింగంలో వస్తుండటంతో మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాను దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 12 ఏండ్ల కిందట వచ్చిన సింగం సినిమా బాలీవుడ్లో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. నిజానికి ఇది సూర్య నటించిన యముడు సినిమాకు రీమేక్. దీనికి కొనసాగింపుగా మూడేళ్లకు సింగం రిటర్న్స్ తెరకెక్కింది. ఇది తొలిపార్టుకు మించి కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక అప్పటికే గోల్మాల్ సిరీస్‌తో రక్షిత్‌శెట్టి-అజయ్ దేవగణ్‌ల కాంబినేషన్ సూపర్ హిట్టు అనిపించుకోగా.. సింగం సిరీస్‌తో తిరుగులేని కాంబినేషన్లా క్రేజ్ తెచ్చుకుంది.
ITS HAPPENING – CHULBUL PANDEY MEETS BAJIRAO SINGHAM IN SINGHAM AGAIN! #SalmanKhan’s glimpse as #ChulbulPandey with #AjayDevgn in #RohitShetty’s #SinghamAgain – #Dabangg x #Singham crossover FINALLY happening. All you need to know!https://t.co/5oAWtItLDK
— Himesh (@HimeshMankad) October 6, 2024