స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘సలార్’. శృతి హాసన్ నాయికగా కనిపించనుంది. హోంబలే ఫిలింస్ నిర్మాణంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. తాజాగా హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యే చిత్రీకరణకు ప్రభాస్ సిద్ధమవుతున్నారని సమాచారం. భావోద్వేగాలతో కలిసి యాక్షన్ కథతో ఈ సినిమా నిర్మితమవుతున్నది. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు కదిలించే ఎమోషన్ కూడా చిత్రంలో ఉంటుందని తెలుస్తున్నది. ప్రభాస్ ఈ సినిమాతో పాటు ‘ప్రాజెక్ట్ కె’ చిత్ర షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు. ఆయన నటించిన ‘ఆది పురుష్’ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నది.