Salaar writer | కలర్‌ఫొటో సినిమాతో హీరోగా మంచి బ్రేక్ అందుకున్నాడు సుహాస్ (Suhas). ప్రస్తుతం దుష్యంత్ కటికనేని దర్శకత్వంలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ విడుదలకు రెడీ అవుతోంది. కాగా ఇప్పుడు సుహాస్ కొత్త సినిమా అప్డేట్తో మూవీ లవర్స్ ముందుకొచ్చాడు. ఈ సారి ఏకంగా సలార్ రైటర్‌తో పనిచేసే అవకాశాన్ని కొట్టేశాడు. సలార్ (Salaar)కు డైలాగ్ రైటర్‌గా పనిచేసిన సందీప్ రెడ్డి బండ్ల (Sandeep Reddy Bandla) ఈ చిత్రంతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు.
ఈ సినిమా పూజా కార్యక్రమానికి సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బలగం డైరెక్టర్ వేణు యెల్దండి, అనిల్ రావిపూడితోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నరకాసుర ఫేం సంగీర్తన విపిన్ ఈ చిత్రంలో సుహాస్ లవర్‌గా నటిస్తోంది. బలగంతో సూపర్ సక్సెస్ అందుకున్న హన్షిత రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టనుంది. ఈ సినిమాపై మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారట మేకర్స్.
టీజర్ అప్డేట్..
సౌండ్ దద్దరిల్లిపోతుంది 🥁🎷
Get ready for a ‘GUTSY TALE’ from Ambajipeta 💥💥#AmbajipetaMarriageBand teaser announcement tomorrow at 11.07 AM ❤️🔥#BunnyVas @ActorSuhas @Shivani_Nagaram @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @GA2Official @Mahayana_MP @SonyMusicSouth pic.twitter.com/5o39rSZL5E
— GA2 Pictures (@GA2Official) October 4, 2023
గ్యాంగ్ ల్యాండ్ అయ్యింది…
ఇంక బ్యాండ్ మోగిపోతుంది 🎺🥁
Here’s the first look of #AmbajipetaMarriageBand 💥💥#BunnyVas @ActorSuhas @Dushyanth_dk @mahaisnotanoun @DheeMogilineni @GA2Official @Mahayana_MP pic.twitter.com/guIzq9UFu7
— BA Raju’s Team (@baraju_SuperHit) April 11, 2023
ఇప్పటికే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంఛ్ చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. మ్యారేజ్ బ్యాండ్ టీం సాగించే ఫన్ రైడ్ స్టోరీతో సినిమా ఉండబోతున్నట్టు ఫస్ట్ లుక్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. ఈ మూవీలో పుష్ప ఫేం జగదీశ్ ప్రతాప్ బండారి, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2, మహాయణ మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సుహాస్ దీంతోపాటు ఆనందరావ్ అడ్వంచర్స్ (Anandrao Adventures) సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రామ్ పసుపులేటి దర్శకత్వం వహిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.