Salaar vs Dunki | ఎప్పుడో ఏడాది కింద తమ సినిమా డిసెంబర్ 22న వస్తుందని రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసింది డంకీ టీం. షారుక్ వస్తున్నాడు కదా అని మిగిలిన సినిమాలు ఏవి ఆ డేట్ వైపు చూడలేదు. కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు.. మిగిలిన ఇండస్ట్రీలో కూడా పెద్ద సినిమాలు ఎవరు డిసెంబర్లో ప్లాన్ చేసుకోలేదు. దానికి తోడు ఇప్పుడు షారుక్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఒకే ఏడాది రెండుసార్లు 1000 కోట్ల క్లబ్బులో చేరి ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు ఈయన. ఇలాంటి సమయంలో ప్రభాస్ సలార్ సినిమా ఉన్నట్టుండి డిసెంబర్ 22న రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకోవడంతో డంకీ టీంకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. సరిగ్గా ఇదే విషయంలో షారుక్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది.
మధ్యలో వచ్చింది వాళ్లు కాబట్టి మేమెందుకు వెనక్కి తగ్గాలి అని డిస్ట్రిబ్యూటర్లతో షారుక్ చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. బయటకు చెప్పడం లేదు కానీ లోపల మాత్రం ప్రభాస్ అండ్ టీంపై షారుక్ చాలా కోపంగా ఉన్నాడని.. ఉన్నట్టుండి ఇలా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేస్తే అంతకుముందు కన్ఫమ్ చేసుకున్న సినిమాలు ఏమైపోవాలి అనే.. కనీస ఆలోచన లేకపోతే ఎలా అంటూ ఆయన సీరియస్ అయినట్టు బాలీవుడ్ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం. దీనికి మరో కారణం కూడా లేకపోలేదు. షారుక్, ప్రభాస్ సినిమాలలో డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువగా ప్రభాస్ వైపు ఆసక్తి చూపిస్తుండటంతో షారుక్ కోపం కట్టలు తెంచుకున్నట్లు తెలుస్తోంది.
రేషియో ప్రకారం చూస్తే 40% థియేటర్లు డంకీ.. 60 శాతం సలార్‌కు ఇవ్వాలని చూస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఇదే జరిగితే కింగ్ ఖాన్‌కు ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు. ఎందుకంటే ఒకే ఏడాది రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన తర్వాత కూడా తన సినిమాను కాదని.. ఒక సౌత్ సినిమాకు ఎక్కువ థియేటర్స్ ఇస్తే అంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు. అందుకే ఏదైతే అది అవుతుందని యుద్ధానికి సిద్ధం అవుతున్నాడు షారుక్. ప్రస్తుతం ఉన్న మార్కెట్ లెక్కల ప్రకారం చూస్తే షారుక్ కంటే ప్రభాస్ సినిమా కాస్త ఎడ్జ్‌లో ఉంది. మాస్ మూవీ కావడంతో సలార్ వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. దానికి తోడు ప్రశాంత్ నీల్ టేకింగ్ కూడా దీనికి హెల్ప్ అవుతుంది.
రాజ్ కుమార్ హిరానీ సెన్సేషనల్ డైరెక్టర్ అయిన కూడా మాస్ ఆడియన్స్‌కు నచ్చే అంశాలు ఆయన సినిమాల్లో తక్కువగానే ఉంటాయి. ఎక్కువగా సబ్జెక్టు బేస్ మీద వెళుతుంటాడు హిరాని. షారుక్ సినిమాను కూడా అలాగే తెరకెక్కిస్తున్నాడు ఈయన. ఇప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు డంకీ టీంతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు.. వాళ్ల సినిమాను డిసెంబర్ 22 కాదని మరో డేట్‌కు వెళ్లేలా ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ షారుక్ మాత్రం దీనికి ససేమిరా అంటున్నట్టు తెలుస్తుంది. కావాలంటే సలార్ డేట్ మార్చుకోమని చెప్పండి.. అంతేకానీ మా సినిమా మాత్రం మార్చుకోమని బయ్యర్లకు తేల్చి చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి డిసెంబర్ 22న పెద్ద యుద్ధం జరగబోతుంది. ఇందులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి..!