Salaar Trailer | పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో సలార్ (Salaar) ఒకటి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), ప్రభాస్ (Prabhas) కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన Salaar Part-1 Ceasefire టీజర్ నెట్టింట వైరల్ అవుతూ.. మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సలార్ ట్రైలర్‌ను డిసెంబర్ 01న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ సంబంధించి తాజాగా ఒక అప్డేట్ వచ్చింది.
ఈ ట్రైలర్‌పై ప్రశాంత్ నీల్ (Prashanth Neel) భార్య లిఖిత రెడ్డి నీల్ సోషల్ మీడియాలో సాలిడ్ అప్డేట్ను అందించింది. సలార్ ట్రైలర్‌కి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి అంటూ స్టూడియో నుంచి దింపిన ఫొటోను పోస్ట్ చేసింది. ఇక ముందు చెప్పినట్లుగానే సలార్ ట్రైలర్‌ను డిసెంబర్ 01 రాత్రి 7 గంటల 19 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.
ఇక మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్లో డార్క్షేడ్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే స్టన్నింగ్ విజువల్స్ మధ్య సలార్‌గా రెబల్ స్టార్ ప్రభాస్ ఎంట్రీ ఇస్తున్న సన్నివేశాలు ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ఈ సారి అంతర్జాతీయ మాఫియా చుట్టూ తిరిగే కథాంశంతో సలార్‌ను తెరకెక్కిస్తున్నాడట. అంతేకాదు ఇందులో ఓ ఇంటర్నేషనల్ యాక్టర్ కూడా నటిస్తున్నాడని వార్తలు వస్తుండగా.. దీనిపై హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ అండ్ మేకర్స్ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
సలార్‌లో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న సలార్ పార్ట్-1 2023 డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక సలార్ పార్ట్-2 విడుదలపై క్లారిటీ రావాలంటే పార్టు 1 వరకు రిలీజయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.