Salaar Trailer | పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో సలార్ (Salaar) ఒకటి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది. ఇప్పటికే ట్రైలర్, ఫస్ట్ సింగిల్‌తో ఈ సినిమా సూపర్ క్రేజ్ సంపాదించుకోగా, తాజాగా మూవీ టీమ్ మరో సాలిడ్ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమా నుంచి మొదట విడుదల చేసిన ట్రైలర్‌కి ప్రశంసలతోపాటు విమర్శలు కూడా ఎదురవ్వడం చర్చనీయాశంగా మారిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్‌ని చూసిన కొందరు క్రిటిక్స్.. సినేరియా మొత్తం ‘కేజీఎఫ్’ తరహాలోనే ఉందని, కథ కూడా దాదాపు అలాగే ఉందని, దీన్ని ‘కేజీఎఫ్ 3’ అనుకోవచ్చని విమర్శలు గుప్పించారు. అయితే ఈ సినిమా ట్రైలర్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో మేకర్స్ సలార్ నుంచి రెండో ట్రైలర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మూవీ నుంచి సెకండ్ ట్రైలర్‌ను ఈరోజు కానీ రేపు కానీ విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. అయితే ఫస్ట్ ట్రైలర్లో దేవ (ప్రభాస్), వరద (పృథ్విరాజ్) మధ్య స్నేహం గురించి ఎక్కువగా చూపించారు. ఇక రానున్న రెండో ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా.. ప్రభాస్ రోల్‌ని హైలెట్ చేస్తుందని తెలుస్తుంది.
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కోలీవుడ్ బ్యూటీ శ్రుతి హాసన్ నటిస్తుండగా కీలక పాత్రల్లో పృథ్విరాజ్ సుకుమారన్, బాబీ సింహా, జగపతిబాబు, టిన్నూ ఆనంద్, ఈశ్వరి రావు, శ్రియారెడ్డి, రామచంద్ర రాజు తదితరులు కీలక పాత్రల్లో పోషించారు. ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించాడు.