Salaar Second Single | ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ అభిమానులతోపాటు పాన్ ఇండియా సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సలార్’. ఈ చిత్రం మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి మేకర్స్ వరుస అప్డేట్లు ఇస్తూ.. ఫ్యాన్స్‌ను ఊపిరాడకుండా చేస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట ఈ సినిమా నుంచి రిలీజ్ ట్రైలర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది.
సలార్ నుంచి సెకండ్ సింగిల్ ప్రతికథలో(Prathikadalo) అనే సాంగ్‌ను ఈరోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు ఇటీవలే సలార్ ఫస్ట్ సింగిల్ సూరీడే (Sooreede) లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. సూరీడే గొడుగు పట్టి.. వచ్చాడే భుజం తట్టి చిమ్మ చీకటిలో నీడలా ఉండెటోడు.. అంటూ సాగుతున్న ఈ పాట సలార్, వరద రాజ మన్నార్ స్నేహం నేపథ్యంలో సాగుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసిన సూరీడే లిరికల్ వీడియో సాంగ్ నెట్టింట వ్యూస్ పంట పండిస్తూ.. టాక్ ఆఫ్ ది టౌన్ నిలుస్తోంది. సలార్‌లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. జగపతిబాబు, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్, సప్తగిరి, సిమ్రత్ కౌర్, పృథ్విరాజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Second Single from #SalaarCeaseFire – #Prathikadalo (Telugu), #QissonMein (Hindi), #Prathikatheya (Kannada), #Prathikaramo (Malayalam), #PalaKadhaiyill (Tamil) out today at 4 PM.
Stay Tuned & Subscribe to https://t.co/NmRhaBjOO7
Music by @RaviBasrur 🎶#Salaar #Prabhas… pic.twitter.com/HLZB6tskQo
— Salaar (@SalaarTheSaga) December 21, 2023