Salaar Trailer | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న తాజా చిత్రం సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ (Salaar: Part 1 – Ceasefire) కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్ల (15కోట్లు)కు పైగా వ్యూస్ దాటాయి. అయితే ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది.
ఈ సినిమా రన్టైంకు సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకు సెన్సార్ కంప్లీట్ అయినట్లు.. సెన్సార్ బోర్డు ఈ మూవీకి ‘A’ సర్టిఫికెట్ ఇచ్చినట్లు టాక్. సలార్ మూవీలో యాక్షన్ సీన్స్‌తో పాటు వయోలెన్స్ ఎక్కువ ఉండడం వలన ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అలాగే సలార్ రన్‌టైం 2 గంటల 55 నిమిషాలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు సలార్ ట్రైలర్‌కు మిక్స్డ్ రివ్యూలు రావడంతో మేకర్స్ సలార్ నుంచి రెండో ట్రైలర్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ట్రైలర్‌ను డిసెంబర్ 16న లేదా 18న విడుదల చేయనున్నట్లు టాక్.
#Salaar Movie Censor its certified (A)
Duration : 2 Hours 55 Minutes 22 Seconds
12 Days Till Premiere‼️#Prabhas #SalaarCeaseFire pic.twitter.com/NXEBxzsgcJ
— Prabhas Fans USA🇺🇸 (@VinayDHFprabhas) December 9, 2023
#SALAAR pic.twitter.com/opkUJYcfio
— Aakashavaani (@TheAakashavaani) December 9, 2023