Salaar Movie | ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలపై బాంబ్ పేల్చిన హోంబలే సంస్థ..!
Salaar Movie | ప్రభాస్ ఫ్యాన్స్ ఏదైతే జరగొద్దు అని టెన్షన్ పడ్డారో అదే జరిగింది. సలార్ పోస్ట్ పోన్ అని అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ఫ్యాన్స్‌ను చల్లబరిచేందుకూ సలార్ టీమ్ ఓ నోట్‌ను కూడా రిలీజ్ చేసింది.
Salaar Movie | ప్రభాస్ ఫ్యాన్స్ ఏదైతే జరగొద్దు అని టెన్షన్ పడ్డారో అదే జరిగింది. సలార్ పోస్ట్ పోన్ అని అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ఫ్యాన్స్‌ను చల్లబరిచేందుకూ సలార్ టీమ్ ఓ నోట్‌ను కూడా రిలీజ్ చేసింది. సలార్ సినిమాపై మీరు చూపిస్తున్న సపోర్ట్‌కి అభినందనలు. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ చేయాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల సినిమాను పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి మా ఈ నిర్ణయాన్ని అర్దం చేసుకోండి. సినిమాను హయ్యెస్ట్ స్టాండర్డ్స్‌లో అందించడానికి మా టీమ్ తీవ్రంగా శ్రమిస్తోంది అని చెప్పుకొచ్చింది.
ఇక కొత్త రిలీజ్ డేట్‌ను రెండు వారాల్లోగా ప్రకటించబోతున్నట్లు వెల్లడించింది. సలార్ సీజ్ ఫైర్కి తుది మెరుగులు దిద్దుతున్నట్లు, ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగం అయినందుకు థాంక్స్ అని చిత్ర యూనిట్ పేర్కొంది.నిజానికి సలార్ సినిమా చెప్పిన డేట్‌కు పక్కా వస్తుందన్న క్లారిటీ కూడా నిర్మాతల్లో ముందుగా లేదని బెంగళూరు వర్గాల టాక్. అప్పుడే యూఎస్‌లో బుకింగ్స్ ఎందుకు ఓపెన్ చేశారని ఆయా డిస్ట్రిబ్యూటర్లపై చిరాకు కూడా పడ్డాడట. ఒకవేళ సినిమా పోస్ట్ పోన్ అయితే.. రీ ఫండ్ చేయాలంటే పెద్ద టాస్క్ అని వాళ్లపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడట. చివరికి అనుకున్నదే జరిగింది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా శృతిహాసన్ నటిస్తుంది.ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌కు టాలీవుడ్ సహా అన్ని వుడ్‌లలో ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను దీపావళికి రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట.
We deeply appreciate your unwavering support for #Salaar. With consideration, we must delay the original September 28 release due to unforeseen circumstances.
Please understand this decision is made with care, as we're committed to delivering an exceptional cinematic experience.… pic.twitter.com/abAE9xPeba— Hombale Films (@hombalefilms) September 13, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

