Salaar Movie | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న తాజా చిత్రం సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ (Salaar: Part 1 – Ceasefire) కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న విడుదల కానుంది. మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఎప్పుడెప్పుడా అని ఈ సినిమాని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక శుక్రవారం కర్ణాటకలో ‘సలార్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తొలి టిక్కెట్‌ను టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజమౌళి కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70MM థియేటర్లో భారీ ధరకు ఫస్ట్ టికెట్ ను బుక్ చేసుకున్నారు జక్కన్న. ఇక ఈ టికెట్ ధర చూసుకుంటే.. అక్షరాలా 10,116 రూపాయలు అని సమాచారం. ఇక రాజమౌళి ఫస్ట్ టికెట్‌ను ఇంత ధరకు కొనడంతో.. ఈ మూవీపై అంచనాలు మరింతగా పెరిగాయి. కాగా ఈ సినిమా.. నైజాం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకున్నారు.