Saiyaaara Movie | బాలీవుడ్‌తో పాటు ప్రస్తుతం ఇండియా అంతటా వినిపిస్తున్న పేరు సైయారా (Saiyaara). చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఇండియాతో పాటు వరల్డ్ వైడ్‌గా సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం రూ. 400 కోట్ల వసూళ్లను రాబట్టి విజయవంతంగా దూసుకెళుతుంది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం మరో రికార్డును అందుకుంది. ఓవర్సీస్లో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సొంతం చేసుకున్న బాలీవుడ్ సినిమాగా రికార్డు నెలకొల్పిన ‘ఛావా’(Chhaava) సినిమా రికార్డును బీట్ చేసింది సైయారా. ఛావా సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.91 కోట్లు వసూళ్లను రాబట్టి.. ఈ ఏడాది టాప్‌లో ఉండగా.. కేవలం 13 రోజుల్లోనే ఈ రికార్డును అధిగమించి రూ.94 కోట్లతో దూసుకుపోతుంది సైయారా. ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించగా.. ఆహాన్ పాండే, అనిత్ పడ్డా హీరో హీరోయిన్లుగా నటించారు.