Saiyaaara Movie | బాలీవుడ్‌తో పాటు ప్రస్తుతం ఇండియా అంతటా వినిపిస్తున్న పేరు సైయారా (Saiyaara). చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం ఇండియా వైడ్‌గా రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించగా తాజాగా వరల్డ్ వైడ్‌గా రూ.256 కోట్ల వసూళ్లను సాధించినట్లు చిత్రనిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఒక్క ఇండియాలోనే రూ.212 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం గ్లోబల్ వైడ్‌గా రూ.43 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో చాలా రోజుల తర్వాత బాలీవుడ్‌కి మంచి హిట్ వచ్చిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ‘సైయారా’ టీమ్ ఈ అనూహ్య విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించగా.. ఆహాన్ పాండే, అనిత్ పడ్డా హీరో హీరోయిన్లుగా నటించారు.
Thankful for all the ❤️ for #Saiyaara
In cinemas now, book your tickets today – https://t.co/VPBDTKuVsY | https://t.co/SMKkZcWdNN… #AhaanPanday | #AneetPadda | @mohit11481 | #AkshayeWidhani pic.twitter.com/ccCL1ii2cW— Yash Raj Films (@yrf) July 25, 2025