Saira Banu | ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఇటీవల తన భార్య సైరా భానుతో విడిపోతున్నట్లు ప్రకటించారు. దాదాపు 29 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు వెల్లడించారు. తాజాగా విడాకులపై సైరా బాను స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ.. రెహమాన్‌తో తన బంధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రెహమాన్ ప్రతిష్టను దిగజార్చొద్దంటూ కోరింది. రెహమాన్‌తో పాటు కుటుంబాన్ని బాధపెట్టడం మానుకోవాలని మీడియాతో పాటూ యూట్యూబర్స్కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యంపై పలు విషయాలు వెల్లడించింది. తాను చాలాకాలంగా ఇంట్లోనే ఉంటున్నానంటూ ఓ ఆడియో ప్రకటన విడుదల చేశారు. తాను రెహమాన్ ప్రస్తుతం ముంబయిలోనే ఉన్నానన్నారు.
గత కొద్దినెలలుగా ఇక్కడే ఉన్నానని.. చాలాకాలంగా ఇలాగే ఉండడం వల్లే విడాకులు తీసుకుంటున్నాని చెప్పింది. రెహమాన్ ప్రపంచంలోనే అత్యత్తుమ వ్యక్తి అని.. అనారోగ్య కారణాలతో చెన్నై వెళ్లలేకపోయినట్లు తెలిపారు. తాను చెన్నైలో లేకపోవడంతో చాలామంది జనాలు సైరా ఎక్కడ ఉందోనంటూ ఆశ్చర్యపోతున్నారని.. తాను ముంబయిలో చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో ప్రైవసీని గౌరవించాలని.. రెహమాన్‌తో ఇప్పటికీ తాను ప్రేమలోనే ఉన్నామన్నారు. విడిపోవాలన్నది వందశాతం ఏకాభిప్రాయమని.. ఆయనను చాలా ప్రేమిస్తున్నానని.. రెహమాన్ పేరును చెడగొట్టాల్సిన అవసరం లేదని చెప్పింది. ఇద్దరి మధ్య భావోద్వేగపూరిత ఒత్తిడి కారణంగా కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని చెప్పింది. ఇప్పటికైనా విమర్శలు మానాలని.. త్వరలోనే చెన్నైకి రానున్నట్లు ఆడియోలో సైరా బాను వివరించారు.