Saindhav Movie | విక్టరీ వెంకటేష్ నుంచి సరైన సినిమా వచ్చి ఏళ్లు దాటింది. ఆ మధ్య నారప్ప వంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్‌తో వచ్చినా.. అది నేరుగా రిలీజవడం, పైగా అప్పటికే దీని ఒరిజినల్ అసురన్ చాలా మంది చూసేయడంతో ప్రేక్షకులు పెద్దగా అంచనాలు లేకుండానే వచ్చింది. ఇక వెంకీ మామ ఇప్పుడు 75వ మైలు రాయికి చేరుకున్నాడు. తన ప్రతిష్టాత్మక 75వ సినిమా జీవితంలో గుర్తిండిపోయేదై ఉండాలని.. ఏకంగా హిట్ సిరీస్ దర్శకుడు సైలేష్ కొలనును రంగంలోకి దింపాడు. సైంధవ్ అంటూ టైటిల్ పోస్టర్‌తోనే వీర లెవ్లలో అంచనాలు క్రియేట్ చేశాడు. ఇది కదా వెంకీ మామ నుంచి కావాల్సిన సినిమా అన్న రేంజ్లో గ్లింప్స్‌ను వదిలాడు.
ఇలా ఒక్కొక్కటిగా సినిమాకు సంబంధించిన అప్డేట్లు ప్రకటిస్తూ అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోతున్నాడు. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఫ్యామిలీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్, ఓ చిన్న పాపతో కలిసి వెంకటేష్ బీచ్ ఒడ్డున కూర్చుని నవ్వుతున్న ఫోటోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలో జరుగుతుంది. అక్కడ భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు కొంత టాకీ పార్టును కూడా చిత్రీకరించనున్నారట. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉండబోతున్నాయని ఇన్ సైడ్ టాక్.
ముఖ్యంగా ఈ సినిమాలో బ్లాక్ మేజిక్ కీలక పాత్ర పోషించనుందట. ఇదే కాన్సెప్ట్‌కు బలమైన డాటర్ సెంటిమెంట్‌ను జోడించి ఆసక్తికర కథగా సైలేష్ ఈ చిత్రాన్ని మలిచాడని తెలుస్తుంది. హిట్ సిరీస్‌తో థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట అని పేరు పొందిన సైలేష్.. ఈ సినిమాతో అసలు సిసలైన థ్రిల్లర్ అంటే ఏంటో చూపించబోతున్నాడట. ముఖ్యంగా జంప్ స్కేర్ సీన్స్ పుష్కలంగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నిహారిక ఎంటర్టైనమెంట్స్ బ్యానర్ రూపొందిస్తుంది.
Team #SAINDHAV wishes you & your family a blessed #GaneshChaturthi 🙏#SaindhavOn22ndDEC ❤️🔥
Victory @VenkyMama @Nawazuddin_S @arya_offl @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @vboyanapalli @tkishore555 @maniDop #Venky75 pic.twitter.com/HnTTWGjh6A
— Niharika Entertainment (@NiharikaEnt) September 18, 2023