Alia-Ranbhir wedding | బాలీవుడ్ ప్రేమజంట ఆలీయాభట్, రణ్‌బీర్ కపూర్ పెళ్ళి సందడి షురూ అయ్యింది. బుధవారం మెహందీ వేడుక ఘనంగా జరిగింది. నీతూకపూర్, కరీష్మా కపూర్, రిద్ధిమా కపూర్ మెహందీ ఫోటోలను సోషల్ మీడియాలో ద్వారా పంచుకున్నారు. గురువారం ఉదయం హల్ధీ ఫంక్షన్ జరిగింది. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారని తెలుస్తుంది. ముంబైలోని వాస్తు అపార్టుమెంట్లో గురువారం సాయంత్రం వీళ్ళ పెళ్ళి ఘనంగా జరుగనుంది. ఈ క్రమంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్ళికి హాజరయ్యారు.
ఈ పెళ్ళికి బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ ఆలీఖాన్, కరీనా కపూర్లతో పాటు ఆలీయా భట్ బెస్ట్ ఫ్రెండ్ ఆకాంక్షరాజన్, నీలా దేవీ కపూర్, అయాన్ ముఖర్జీ, కరణ్ జోహర్‌లతో హాజరయ్యారు. ఇక రణ్‌బీర్ మాజీ ప్రియురాళ్ళు కత్రినాకైఫ్, దీపికా పదుకొణె కూడా ఈ పెళ్ళికి రానున్నట్లు తెలుస్తుంది. అయితే రణ్‌బీర్‌కపూర్, ఆలీయాలు వాళ్ళ పెళ్ళిని సీక్రెట్‌గా జరుపుకోవాలని భావించారట. కానీ ఈ విషయం మీడియా చెవిలో పడింది. దాంతో గతంవారం రోజుల నుంచి సోషల్ మీడియాలో వీళ్ళ పెళ్ళికి సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయి.