బాలీవుడ్ నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సయీ మంజ్రేకర్ (Saiee Manjrekar). సల్మాన్ ఖాన్ తో తొలిసారి దబాంగ్ 3 (Dabaang 3) చిత్రంతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది. ఈ చిత్రంలో తన అందం, అభినయంతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఇటీవలే వరుణ్ తేజ్‌తో కలిసి గని సినిమాలో మెరువగా ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టింది.
ఇపుడు అడివిశేష్‌తో కలిసి మేజర్ (Major) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది సయీ మంజ్రేకర్. ఈ భామ రీసెంట్గా పాపులర్ టీవీ షో అలీతో సరదా షోలో సందడి చేసింది. ఈ బ్యూటీ తన కొచ్చిన కొంచెం కొంచెం తెలుగు భాషలో మాట్లాడుతూ..ఫన్ క్రియేట్ చేసింది. ఇక మహేశ్ బాబును కలిశారా..? అని అడుగగా..నిన్న తొలి సారి కలిశానని చెప్పింది సయీ.
నెక్ట్స్ సినిమాలో నన్ను హీరోయిన్గా పెట్టుకోవాలని మహేశ్‌ను అడగలేదా..? అడిగారు అలీ. దీనికి సయీ మంజ్రేకర్ రిప్లై ఇస్తూ..నేను మహేశ్ బాబు అందం వెనుకున్న సీక్రెట్ ఏంటని అడిగా..ఆయన ఇప్పటికీ చాలా యంగ్‌గా కనిపిస్తుంటారని చెప్పుకొచ్చింది. మేజర్ హీరోహీరోయిన్లతో అలీ సరదా ముచ్చట్లకు సంబంధించిన ప్రోమో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.