Sai Srinivas | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంట పెళ్లి సందడి.. వైరల్ అవుతున్న పెళ్లి కొడుకు ఫంక్షన్ ఫొటోలు
Sai Srinivas | టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంట్లో పెళ్లి సంబరాలు ప్రారంభమయ్యాయి. తన ప్రేయసి కావ్యారెడ్డితో ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నెల 29న తిరుమలలో వీరి వివాహ వేడుక జరగనుండగా, కుటుంబ సభ్యులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి కొడుకు ఫంక్షన్ ని నిర్వహించారు.
Sai Srinivas | టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంట్లో పెళ్లి సంబరాలు ప్రారంభమయ్యాయి. తన ప్రేయసి కావ్యారెడ్డితో ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నెల 29న తిరుమలలో వీరి వివాహ వేడుక జరగనుండగా, కుటుంబ సభ్యులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి కొడుకు ఫంక్షన్ ని నిర్వహించారు. ఇందులో రాయల్ లుక్లో కనిపించారు. వీరి పెళ్లి ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. కొందరు నెటిజన్స్ అయితే సోషల్ మీడియాలో అప్పుడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా బెల్లంకొండ కుటుంబం పెళ్లి ఆహ్వాన కార్యక్రమాన్ని వేగంగా కొనసాగిస్తోంది. సాయి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను వ్యక్తిగతంగా కలుసుకుని ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల సాయి శ్రీనివాస్ కుటుంబంతో కలిసి నటుడు నాగార్జున నివాసానికి వెళ్లి పెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. తిరుమలలో జరగనున్న ఈ శుభకార్యానికి కుటుంబ సమేతంగా హాజరు కావాలని కోరగా, నాగార్జున ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా మర్యాదపూర్వకంగా కలుసుకుని పెళ్లికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కూడా సాయి శ్రీనివాస్కు తన శుభాకాంక్షలు తెలియజేశారు. కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిసి ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. ఈ ఆహ్వానాల సందర్భంగా తీసిన చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. తిరుమలలో జరగనున్న ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.మొత్తానికి బెల్లంకొండ కుటుంబంలో జరగనున్న ఈ పెళ్లి వేడుక టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

