Sai Srinivas | తిరుమలలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం.. ప్రముఖులకు ఆహ్వానాలు అందజేస్తున్న హీరో
Sai Srinivas | టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. తన ప్రేయసి కావ్యారెడ్డితో ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నెల 29న తిరుమలలో వీరి వివాహ వేడుక జరగనుండగా, కుటుంబ సభ్యులు ఇప్పటికే శుభకార్యానికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
Sai Srinivas | టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. తన ప్రేయసి కావ్యారెడ్డితో ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నెల 29న తిరుమలలో వీరి వివాహ వేడుక జరగనుండగా, కుటుంబ సభ్యులు ఇప్పటికే శుభకార్యానికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గత కొన్ని రోజులుగా బెల్లంకొండ కుటుంబం పెళ్లి ఆహ్వాన పత్రికలను ప్రముఖులకు అందజేస్తోంది. ఈ క్రమంలో సాయి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను వ్యక్తిగతంగా కలుసుకుని ఆహ్వానిస్తున్నారు. ఈ ఆహ్వాన కార్యక్రమం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది.
రీసెంట్గా సాయి శ్రీనివాస్ కుటుంబంతో కలిసి నాగార్జున అక్కినేని నివాసానికి వెళ్లి పెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. తిరుమలలో జరగనున్న ఈ శుభకార్యానికి కుటుంబ సమేతంగా హాజరు కావాలని ఆయనను కోరారు. ఈ సందర్భంగా నాగార్జున సాయి శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను కూడా బెల్లంకొండ కుటుంబం మర్యాదపూర్వకంగా కలుసుకుంది. పెళ్లి ఆహ్వాన పత్రికను అందజేసి, కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కూడా సాయి శ్రీనివాస్‌కు తన శుభాకాంక్షలు తెలిపారు. కాగా, కొద్ది రోజుల క్రితం చిరంజీవిని కూడా కలిసి ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే.
ఈ ఆహ్వానాల సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు సాయి శ్రీనివాస్‌కు ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతూ సందడి చేస్తున్నారు. తిరుమలలో జరిగే ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. బెల్లంకొండ కుటుంబంలో జరిగే ఈ పెళ్లి వేడుక టాలీవుడ్లో హాట్ టాపిక్ కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

