సంపూర్ణేశ్ బాబు హీరోగా నటించిన చిత్రం హృదయకాలేయం. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ఎంట్రీతోనే సంపూర్ణేశ్‌కు హీరోగా మంచి బ్రేక్ అందించింది. డైరెక్టర్ సాయిరాజేశ్ (Sai Rajesh)కు కూడా మంచి హిట్టు పడ్డది. ఈ డైరెక్టర్ ఇపుడు బేబి (Baby) సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ మూవీ టీజర్ అప్డేట్ ను కొత్తగా అందించారు మేకర్స్. ఇటీవలే జిన్నా ఈవెంట్లో జారు మిఠాయా పాట పాడిన ఫోక్ సింగర్ స్టైల్లో బేబి టీజర్ అప్డేట్ అందించి.. మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తున్నారు. బేబి టీజర్ ఇవాళ సాయంత్రం 6:15 గంటలకు గీతా ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్లో విడుదల చేయనున్నట్టు తెలియజేశారు మేకర్స్.
ఈ టీజర్ అప్డేట్ వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. బేబి టీజర్‌పై క్యూరియాసిటీ పెంచుతున్న వీడియోను సాయి రాజేశ్ ట్విటర్లో షేర్ చేశాడు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ బల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు. ఫన్నీగా సాగుతున్న టీజర్ అప్డేట్ వీడియోపై ఓ లుక్కేయండి మరి..
బేబి టీజర్ అప్డేట్ ప్రమోషన్స్.. వీడియో
#BabyTeaser today evening 6:15pm at Geetha Arts YouTube channel….Choodakunte oppukonu janmkalidi jaarumitaaya pic.twitter.com/9bVdpxIDNC
— Sai Rajesh (@sairazesh) November 21, 2022