Ek Din New Trailer | స్టార్ బ్యూటీ సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఏక్ దిన్’ (Ek Din). అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా మే 01న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ ట్రైలర్ చూస్తుంటే.. హీరోయిన్ (సాయి పల్లవి) ఇందులో ఒక అరుదైన వ్యాధితో బాధపడుతుంటుంది. అయితే తనను ప్రేమించిన హీరో (జునైద్) అమెతో ఒక్కరోజు అయిన ప్రేమతో గడపాలని కోరుకుంటాడు. అయితే ఆ ఒక్క రోజు వారి జీవితాలను ఎలా మార్చేసింది అనేది కథాంశం. తెలుగులో ఈ చిత్రం ఒక రోజు అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సునీల్ పాండే దర్శకత్వం వహిస్తుండగా.. అమీర్ ఖాన్, మన్సూర్ ఖాన్, అపర్ణ పురోహిత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామ్ సంపత్ సంగీతం అందిస్తున్నాడు. సాయి పల్లవి హిందీలో నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.