ఎల్లమ్మ?‘బలగం’తో తెలంగాణ మూలాలను, సంస్కృతిని స్పృశించాడు దర్శకుడు వేణు యెల్దండి. కొందరు ఆ సినిమాను కల్ట్ క్లాసిక్ అంటే.. ఇంకొందరు అనుకోకుండా జరిగిన అద్భుతంగా అభివర్ణించారు. అంతటి విజయం తర్వాత దర్శకునిగా అతనిపై భారం మరింత పెరగడం కామన్. ఈ నేపథ్యంలో ఆయన ‘ఎల్లమ్మ’ కథ రాశాడు. దిల్‌రాజే ఈ సినిమాను కూడా నిర్మించేందుకు ముందుకొచ్చారు. నితిన్ హీరోగా ఖరారయ్యాడు. అసలు ఏంటి ఈ ‘ఎల్లమ్మ’? అనే విషయానికొస్తే.. ఇదో గ్రామదేవత చుట్టూ తిరిగే కథ అని తెలుస్తున్నది. పైగా ఆ దేవతకూ ఇందులోని కథానాయిక పాత్రకూ బలమైన బంధం ఉంటుందట. పైగా కథానాయిక పాత్ర అత్యంత శక్తిమంతంగా ఉండటమే కాక, ఆ పాత్ర చుట్టూ బలమైన భావోద్వేగాలు కూడా అల్లుకొని ఉంటాయని సమాచారం. అందుకే ఆ పాత్ర కోసం సాయిపల్లవిని తీసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారట దర్శకనిర్మాతలు. త్వరలోనే ‘ఎల్లమ్మ’ కథను సాయిపల్లవి వినబోతున్నదని వినికిడి. తను ఓకే చెప్పిందంటే.. సినిమా సగం విజయం సాధించినట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకు మాటలు రాయనున్నారట.