ఇకపై ఆచితూచి మాట్లాడతా!
స్వీయ లోపంబులెరుగుట పెద్ద విద్య అనేది ఆర్యోక్తి. ప్రతి ఒక్కరిలో లోపాలు సహజం.
స్వీయ లోపంబులెరుగుట పెద్ద విద్య అనేది ఆర్యోక్తి. ప్రతి ఒక్కరిలో లోపాలు సహజం. వాటిని తెలుసుకొని, సరిచేసుకునేవారే స్థితప్రజ్ఞులు. ప్రముఖ నటి సాయిపల్లవి ఈ విషయాన్ని కాస్తంత ఆలస్యంగా తెలుసుకున్నది. ఈ మధ్య పలు సందర్భాల్లో ఆమె మాట్లాడిన మాటలు వివాదాలకు దారితీశాయి. అందుకే ఇకపై ఆచితూచి మాట్లాడాలని ఆమె ఫిక్సయ్యారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘మీలో పెంచుకోవాల్సిన స్కిల్ ఏమిటి?’ అనే ప్రశ్నకు సమాధానంగా సాయిపల్లవి మాట్లాడుతూ ‘మనసులోని భావాలను వ్యక్తీకరించడం నాకు చేతకాదు.
దాంతో.. ఏదైతే చెప్పాలనుకున్నానో.. అది వేరేలా కమ్యూనికేట్ అవుతూవుంటుంది. ఒక్కటి మాత్రం నిజం.. జనాభిమానాన్ని పొందిన నటిగా నేను ఏం మాట్లాడినా దానికి విస్తృతమైన ప్రచారం లభిస్తుంది. ఈ కారణం చేతే పలు సందర్భాల్లో విమర్శలు ఎదుర్కోవాల్సివచ్చింది. అందుకే.. సరిగ్గా మాట్లాడే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది సాయిపల్లవి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

