Sai Marthand | చిన్న బడ్జెట్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుని టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు సాయి మార్తాండ్ ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు.సాయి మార్తాండ్ తెరకెక్కించిన లిటిల్ హార్ట్స్ సినిమా కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో రూపొంది, బాక్సాఫీస్ వద్ద దాదాపు 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం. ఈ విజయంతో సాయి మార్తాండ్ పేరు ఒక్కసారిగా టాలీవుడ్లో మార్మోగిపోయింది. తాజాగా తన తదుపరి చిత్రంపై సాయి మార్తాండ్ క్లారిటీ ఇచ్చాడు. అడివి శేష్ నటిస్తున్న డెకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన కీలక ప్రకటన చేశాడు. నా నెక్స్ట్ సినిమా అడివి శేష్ గారితోనే ఉంటుంది. గూఢచారి 2 పూర్తయ్యాక మా సినిమా స్టార్ట్ అవుతుంది. ఇది ఒక లవ్ స్టోరీ” అని వెల్లడించాడు.
ఈ ప్రాజెక్ట్‌లో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే… ప్రముఖ నటులు జగపతి బాబు,సునీల్ ఈ సినిమాతో నిర్మాతలుగా మారుతున్నారు. ఇద్దరూ కలిసి ప్రొడ్యూసర్లుగా వ్యవహరించడం ఇదే తొలిసారి కావడం విశేషం.ఇది వరకూ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణించిన ఈ ఇద్దరు నటులు ఇప్పుడు నిర్మాణ రంగంలో అడుగుపెట్టడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.సాధారణంగా థ్రిల్లర్, సస్పెన్స్ కథలతో ప్రేక్షకులను అలరించే అడివి శేష్… కామెడీ, ఫీల్ గుడ్ కథలను చెప్పే సాయి మార్తాండ్‌తో కలిసి లవ్ స్టోరీ చేయడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కొత్త కాంబినేషన్ ఎలా వర్కౌట్ అవుతుందో అన్నదానిపై సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కథ, ప్రెజెంటేషన్ ఎలా ఉంటాయో చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
గతంలో ‘లిటిల్ హార్ట్స్’ సినిమా సమయంలోనే సాయి మార్తాండ్ తన నెక్స్ట్ సినిమా నిర్మాతగా జగపతి బాబు ఉంటారని చెప్పాడు. ఇప్పుడు అదే మాటను నిలబెట్టుకోవడం విశేషంగా మారింది. ఒక చిన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టిన సాయి మార్తాండ్… ఇప్పుడు స్టార్ హీరో, క్రేజీ నిర్మాతలతో కలిసి మరింత పెద్ద స్థాయిలో తన సత్తా చూపించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ స్పెషల్ కాంబినేషన్ టాలీవుడ్లో ఎలా సంచలనం సృష్టిస్తుందో చూడాలి.