మెగా హీరో సాయిదుర్గతేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. ఓ వైపు ఈ సినిమాను పూర్తి చేస్తూ మరోవైపు తన నెక్ట్స్ సినిమాను కూడా లైన్లో పెట్టారట సాయిదుర్గతేజ్. ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్‌తో అందర్నీ ఆకట్టుకున్న దర్శకుడు తేజా కాకుమాను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారట. అటవీ నేపథ్యంలో ఆయన ఓ కథ రాసుకున్నారు.
ఇందులో పులి పాత్ర కీలకంగా ఉంటుందట. పులితో హీరో పోరాటాలను ఉత్కంఠకు గురిచేసేలా రాసుకున్నారట దర్శకుడు తేజా కాకుమాను. ఇటీవలే ఆయన సాయిదుర్గతేజ్కు కథ వినిపించారట. సాయిదుర్గతేజ్కి కథ బాగా నచ్చడంతో ఆయన్నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిందట. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నదని సమాచారం.