Sai Dharam Tej | సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej). ప్రస్తుతం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో కలిసి బ్రో (Bro The Avatar)లో నటిస్తున్నాడు. ఈ మూవీకి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా సాయిధరమ్ తేజ్ టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్‌నంది (Sampath Nandi)తో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్త కూడా తెరపైకి వచ్చింది. తాజాగా ఈ క్రేజీ సినిమా టైటిల్ న్యూస్ ఒకటి ఇంట్రెస్టింగ్గా మారింది.
ఈ చిత్రానికి గంజా శంకర్ (Ganja Shankar) టైటిల్‌ను ఫైనల్ చేశారని, పవన్ కల్యాణ్ నటించిన గుడుంబా శంకర్ స్పూర్తితో ఈ టైటిల్ ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. మాస్ మసాలా ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాలో గంజా శంకర్‌గా టైటిల్ రోల్లో కనిపించబోతున్నాడట సాయిధరమ్ తేజ్. బ్రో మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ స్టిల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ మూవీలో ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలుగు నేటివిటీకి తగ్గట్టు త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్పులు చేసినట్టు ఇన్సైడ్ టాక్. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.