రాజకీయాంశాల్ని విమర్శనాత్మక కోణంలో చర్చిస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్’. సాయితేజ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. దేవ్ కట్టా దర్శకుడు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని యు.ఎ.సర్టిఫికెట్ పొందింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు తెలిపారు. ఈ సందర్భంగా సినిమా తాలూకు కొత్తపోస్టర్ను విడుదల చేశారు. ఇందులో సాయితేజ్ తీక్షణమైన చూపులతో కోపోద్రిక్తుడై కనిపిస్తున్నారు. నేటి సమాజంలోని సంక్షోభానికి, సామాజిక పరిస్థితులకు అద్దంపడుతూ ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకెత్తించే చిత్రమిదని దర్శకుడు పేర్కొన్నారు. ఐశ్వర్యారాజేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. దేవ్కట్టా తనదైన సామాజిక స్పృహతో ఈ సినిమాను తెరకెక్కించారని, సాయితేజ్ నటన..సంభాషణలు ప్రధానాకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్, సంగీతం: మణిశర్మ, నిర్మాణ సంస్థలు: జీ స్టూడియోస్, జె.బి.ఎంటర్టైన్మెంట్స్, కథ, మాటలు, దర్శకత్వం: దేవ్ కట్టా.