వినాయకచవితి రోజున సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కేబుల్ బ్రిడ్జి సమీపంలో స్పోర్ట్స్ బైక్ జారిపోవడంతో ఆయన కిందపడ్డారు. ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ తలతో పాటు ఛాతీ, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్‌తేజ్‌ను 108 సాయంతో సమీపంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో 35 రోజుల పాటు చికిత్స తీసుకున్నారు.
సరిగ్గా విజయదశమి రోజు సాయిధరమ్ తేజ్ డిశ్చార్జ్ అయ్యారు. ఆ రోజు చిరంజీవి ..‘విజయ దశమి ప్రత్యేక రోజున సాయి ధరమ్ తేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సాయి పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇటీవల పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డ తేజ్‌కు ఇది పునర్జన్మ’ అంటూ రాసుకొచ్చారు. ఇక దీపావళికి మెగా ఫ్యామిలీ హీరోలు అందరు కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తి గా కోలుకున్నాడు. మా కుటుంబసభ్యులందరికి ఇది నిజమైన పండుగ అని తన ట్వీట్లో పేర్కొన్నారు చిరంజీవి .
ప్రమాదం తర్వాత సాయి ధరమ్ తేజ్ తొలి ఫొటో ఇదే కావడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. మరోవైపు ఈ ఫోటోలో చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ అంతా ఈ ఫొటోలో ఉండడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
నా పునర్జన్మకి కారణమైన మీ ప్రేమకి మీ ప్రార్ధనలకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను. మీ ప్రేమ పొందడం నా పూర్వజన్మ సుకృతం.🙏🏼 https://t.co/2de1Ob2JgC
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 5, 2021
అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తి గా కోలుకున్నాడు. మా కుటుంబసభ్యులందరికి ఇది నిజమైన పండుగ. @IamSaiDharamTej pic.twitter.com/DZOepq88ON
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 5, 2021