Sai Dharam Tej | టాలీవుడ్ మెగా నటుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్ లో చావు బతుకుల మధ్య పోరాడి బయటకు వచ్చి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్ సర్వీసులో ముందుంటాడు ఈ హీరో. తన అభిమానులకు ఎటువంటి సాయం కావాలన్నా చేస్తూ ఉంటాడు. తాజాగా ఇద్దరు అనాధ చిన్నారుల ట్రీట్మెంట్కు సాయం అందించి మరోసారి మానవత్వం చాటుకున్నాడు.
ఒక అనాధ శరణాలయం నుండి ఇద్దరు చిన్నారుల ట్రీట్మెంట్కు సాయం కావాలంటూ సాయి ధరమ్ తేజ్‌కు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో మరో నిమిషం ఆలోచించకుండా ఆ చిన్నారులకు సాయం అందించాడు సాయి తేజ్. ఇక ఈ విషయాన్ని టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
Thank you @IamSaiDharamTej your kind help for them, children sent you thank you wishes❤️❤️❤️ pic.twitter.com/gwrzmZQYR7
— I.Andrew babu (@iandrewdop) February 22, 2024