యువ హీరో సాయిధరమ్‌తేజ్ ఇటీవలే తన కొత్త చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యే మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో శివారులో వేసిన భారీ సెట్స్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్నది. 1947 నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
ఐశ్వర్యలక్ష్మీని కథానాయికగా ఎంపిక చేశారు. తాజాగా ఈ చిత్రానికి ‘సంబరాల ఏటి గట్టు’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కథానుగుణంగా అదే టైటిల్ పక్కాగా సరిపోతుందనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అయితే ఈ విషయంలో చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘హను-మాన్’ ఫేమ్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.