Sai Dharam Tej 18 | సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్(SDT 18) తన కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. SDT18గా ఈ ప్రాజెక్ట్ రానుండగా.. హనుమాన్(Hanuman Producers) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో రోహిత్ కేపీ (Rohit KP) దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించి సాలిడ్ అప్డేట్ను పంచుకున్నారు మేకర్స్. ఈ సినిమాకు ‘కాంతార’ మ్యూజిక్ డైరెక్టర్ అజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఓ గ్లింప్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అజనీశ్ లోక్‌నాథ్ ఇంతకుముందు కాంతార, విరూపాక్ష సినిమాలకు అందించిన మ్యూజిక్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
ఈ సినిమ కోసం హనుమాన్ దర్శకుడు నిరంజన్ రెడ్డి ఏకంగా రూ.125 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నట్లు సమాచారం. అయితే సాయి ధరమ్ తేజ్‌తో రూ.125 కోట్ల బడ్జెట్ ఏంటి అని సినిమా విశ్లేషకులతో పాటు ప్రేక్షకుల షాక్ అవుతున్నారు. ఎందుకంటే సాయి ధరమ్ తేజ్ సినీ కెరీర్ లో ఇప్పటివరకు హయ్యెస్ట్ కలెక్షన్స్ చూసుకుంటే విరుపాక్ష చిత్రం రూ.90 కోట్ల గ్రాస్. అదికూడా సాయి ధరమ్ తేజ్ నటన కంటే దర్శకుడి ప్రతిభ వలన ఆ మూవీకి అన్ని కలెక్షన్లు వచ్చాయి. అలాంటిది సాయి ధరమ్ తేజ్ ఇంత బడ్జెట్ పెట్టడం అంటే నిరంజన్ రెడ్డి రిస్క్ చేస్తున్నాడని అది కూడా కొత్త దర్శకుడితో ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌ను తీయడం రిస్క్ తో కూడుకున్న పని అనుకుంటున్నారు.
ఇక ఈ సినిమాకు సంబరాల ఏటి గట్టు (Sambarala Aetigattu) అనే టైటిల్ పెట్టాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. 1947 హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రానుండగా.. ఇలాంటి టైటిల్ అయితేనే మూవీకి సరిపోతుంది అని చిత్రబృందం అనుకున్నట్లు టాక్. ఈ మూవీలో సాయి తేజ్ ఒక యోధుడి పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ఎస్డీటీ 18 రూపొందుతోంది.