Sahana Sahana | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’ నుంచి విడుదలైన రొమాంటిక్ మెలోడి ‘సహనా సహనా నా సఖి సహనా’ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లిన ఈ పాటకు ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ఆడియెన్స్ నుంచి కూడా విపరీతమైన స్పందన వస్తోంది. ఈ పాటలో ప్రభాస్ – నిధి అగర్వాల్ మధ్య కెమిస్ట్రీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఇద్దరి మధ్య రొమాంటిక్ మూమెంట్స్, సాఫ్ట్ డ్యాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. కూల్ లవ్ వైబ్స్‌తో పాటు మెలోడియస్ ట్యూన్ ఉండటంతో ఈ సాంగ్‌ను మళ్లీ మళ్లీ వినాలనిపించేలా రూపొందించారు.
యూరప్‌లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన ఈ పాట విజువల్ ట్రీట్‌గా నిలుస్తోంది. మంచు కొండలు, పచ్చని మైదానాలు, క్లాసీ స్ట్రీట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రభాస్ వింటేజ్ లుక్ మరింతగా హైలైట్ అవుతోంది. సినిమాటోగ్రఫీ, కలర్ టోన్, ఫ్రేమింగ్ అన్నీ కలిసి పాటకు వేరే లెవల్ ఫీల్‌ను ఇచ్చాయి.ఈ రొమాంటిక్ సాంగ్‌కు ప్రముఖ గేయ రచయిత కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా, తమన్, విశాల్ మిశ్రా, శృతి రంజనీ మధురమైన స్వరాలు అందించారు. తమన్ ఇచ్చిన మ్యూజిక్, బీజీఎం పాటకు మెయిన్ ప్లస్‌గా మారింది. లిరిక్స్‌కు తగ్గట్టుగా మ్యూజిక్ సెట్ కావడంతో పాటకు మంచి రిపీట్ వాల్యూ వచ్చింది.
చిత్రం హారర్ కామెడీ మూవీ అయినప్పటికీ, ప్రేమకథను కూడా స్ట్రాంగ్‌గా ప్రెజెంట్ చేశారు. ‘ది రాజా సాబ్’ చిత్రానికి స్టార్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించగా, ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించి అలరించారు. అలాగే సప్తగిరి, వీటీవీ గణేష్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.. ప్రభాస్ తొలిసారి హారర్ కామెడీ జానర్లో నటించడంతో సినిమాపై భారీ హైప్ నెలకొంది. భారీ అంచనాల మధ్య ‘ది రాజా సాబ్’ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న పాన్ ఇండియా లెవల్లో విడుదలైంది.