రామ్‌కిరణ్, మేఘా ఆకాశ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సకుటుంబానాం’ ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఉదయ్‌శర్మ దర్శకత్వంలో హెచ్.మహాదేవ్ గౌడ, హెచ్.నాగరత్నం నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం క్లాప్‌నివ్వగా, కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్ కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సకుటుంబ కథా చిత్రమిది. కదిలించే భావోద్వేగాలుంటాయి. వినోదానికి పెద్దపీట వేశాం’ అన్నారు. ఈ సినిమాలో తను సిరి అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తానని, మనసుకు నచ్చిన క్యారెక్టర్ చేయడం ఆనందంగా ఉందని కథానాయిక మేఘా ఆకాష్ చెప్పింది. వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నామని నిర్మాత పేర్కొన్నారు. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సత్య, రాహుల్ రామకృష్ణ, రచ్చ రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మధు దాసరి, సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రోహిత్ పద్మనాభం, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఉదయ్‌శర్మ.