రామ్ కిరణ్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సః కుటుంబానాం’. డా.రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ఉదయ్‌శర్మ దర్శకుడు. హెచ్.మహాదేవ్ గౌడ్ నిర్మాత. నిర్మాణం తుది దశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఫ్యామిలీమ్యాన్ అనిపించుకుంటున్న కథానాయకుడు.. ఫ్యామిలీని హేట్ చేస్తూ ఈ టీజర్లో కనిపిస్తున్నాడు.
కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇదని టీజర్ చెబుతున్నది. మణిశర్మ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. బ్రహ్మానందం, సత్య, శుభలేఖ సుధాకర్, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మధు దాసరి.