Saha kutumbhanaam | తెలుగులో చేసింది తక్కువ చిత్రాలే అయిన నటనతో తనదైన అభినయంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది తమిళ నటి మేఘా ఆకాశ్(Megha Akash). ‘లై’ సినిమాతో వెండితెరకు పరిచయమై.. ఆ వెంటనే ‘ఛల్ మోహన్‌రంగ’(Chal Mohan Ranga) సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. ఇక సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘పేట’ చిత్రంతో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అందం, అభినయం కలగలసిన ఈ నటి ఇప్పుడు వరుస సినిమా అవకాశాలతో బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే రామ్‌కిరణ్, మేఘా ఆకాశ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘సఃకుటుంబానాం’. ఉదయ్‌శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
నేడు మేఘా ఆకాశ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మేఘాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘సఃకుటుంబానాం’ నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో మేఘా ఆకాశ్ సిరి పాత్రలో అందరిని అలరిస్తుందని చిత్రబృందం ప్రకటించింది.
Team #Sahakutumbhanaam wishing @akash_megha a very happy birthday
స:కుటుంబానాం
Hero:#RaamKiran
Director:#UdaySharma
Producer:#HMahadevGoud #HNagarathna
Presents: H.Nagana Gouda
Music:#Manisharma
Lyrics:#AnanthSriram
Executive: #RohithKumarPadmanabha@HngCinemas#HBDMeghaAkash pic.twitter.com/gzDiCDQegx— Vamsi Kaka (@vamsikaka) October 26, 2023
హెచ్.మహాదేవ్ గౌడ, హెచ్.నాగరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సత్య, రాహుల్ రామకృష్ణ, రచ్చ రవి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి కెమెరా: మధు దాసరి, సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రోహిత్ పద్మనాభం.