కెరీర్ ఆరంభం నుంచి వినూత్న కథలతో ప్రయాణం సాగిస్తున్నారు ఆది పినిశెట్టి. ఆయన నటించిన హారర్ చిత్రం ‘శబ్దం’. అరివళగన్ దర్శకుడు. పారానార్మల్ యాక్టివిటీ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. నైజాంలో ఈ చిత్రాన్ని మైత్రీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా ఆది పినిశెట్టి పంచుకున్న సినిమా విశేషాలు..