అందాల భామలు రెజీనా కసాండ్రా (Regina), నివేదా (Nivetha Thomas) టైటిల్ రోల్స్ పోషిస్తున్న చిత్రం శాకిని డాకిని(Saakini Daakini). ఇటీవలే విడుదలైన టీజర్ స్టన్నింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో అదరగొట్టేస్తుంది. రెజీనా, నివేదా సినిమాలో ఓ వైపు గ్లామరస్‌గా కనిపిస్తూనే..ఇంకోవైపు యాక్షన్ పార్టులో ఇరగదీయబోతున్నారని టీజర్ చెప్పేస్తుంది.
శాకిని డాకిని సెప్టెంబర్ 16న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు టీ మెంబర్స్. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. శాకిని డాకిని సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ U/A సర్టిఫికెట్‌ను జారీచేసింది. కొరియన్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ ఆధారంగా ఈ చిత్రం వస్తోంది.
సురేష్ బాబు, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ కెమెరామెన్. మిక్కీ ఎంసీ క్లియరీ సంగీతం అందిస్తున్నాడు. టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్, స్వామిరారా ఫేం సుధీర్ వర్మ(Sudheer Varma) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
పాటలకు కూడా మంచి స్పందన వస్తోంది. రెజీనా ప్రస్తుతం బైలింగ్యువల్ ప్రాజెక్టు నేనే నా సినిమాతోపాటు తమిళంలో రెండు చిత్రాలు చేస్తోంది. నివేదాథామస్ మలయాళంలో ఓ సినిమాలో నటిస్తోంది.