జగన్మోహన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఎస్99’. శ్వేతావర్మ కథానాయిక, యతీష్, నందిని నిర్మాతలు. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆరు టీజర్లను విభిన్న కాన్సెప్ట్‌లతో విడుదల చేస్తున్నాం. వచ్చే నెల మొదటివారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు.