Ameesha Patel | మహేష్ బాబు నటించిన నాని చిత్రంలో కథానాయికగా నటించి తెలుగు ప్రేక్షకులని అలరించిన అందాల ముద్దుగుమ్మ అమీషా పటేల్. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఈ అమ్మడు బాలీవుడ్‌లోను అనేక సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. 49 ఏళ్ల వయస్సు వచ్చిన కూడా ఈ అమ్మడు ఇంకా పెళ్లి చేసుకోలేదు. స్టిల్ బ్యాచిలర్. అయితే ఈ వయస్సులో కూడా తాను పెళ్లి చేసుకోకపోవడం పట్ల ఎలాంటి బాధలేదని అంటుంది. పెళ్లికి ఎప్పుడు తను ప్రాధాన్యత ఇవ్వలేదని, తన పనిని ఎక్కువగా ఇష్టపడతానని అంటుంది. రిలేషన్ షిప్ లోకి ఎంటర్ కావాలంటే దానికి కొంత సమయం కేటాయించాలి. అలానే కొంత ఇంత ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఇప్పుడు అవి రెండు తనకి లేవని అమీషా పేర్కొంది.
తనలాంటి సక్సెస్ ఫుల్ ఉమెన్, ఇండిపెండెంట్ ఉమెన్‌తో ఏ పురుషుడైనా జీవించడం అంత సులభం కాదని కూడా అమీషా చెప్పారు. తన జీవితం ఇప్పటికే పూర్తి అయిందని, తన గురించి తనకు నమ్మకం ఉందని, కాబట్టి ఇప్పుడు తనకు జీవిత భాగస్వామి అవసరం లేదని అమీషా అంటుంది. బయట నుండి వచ్చి బాలీవుడ్లో మంచి స్థానం సంపాదించుకున్నందుకు గర్వంగా ఉందని అంటుంది. తాజాగా అమీషా పటేల్‌కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది.తాను త్వరలో తల్లి కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తుంది. అందుకు కారణం ఇటీవల దుబాయ్‌లో విహారయాత్రకు వెళ్లినప్పుడు దిగిన కొన్ని ఫొటోలు ,వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అందులో ఆమె పొట్ట కాస్త ఉబ్బినట్టుగా కనిపించడంతో అమీషా గర్భవతి అని అంటున్నారు. ముఖ్యంగా, ఆమె ఒక వీడియోలో ఆకుపచ్చ రంగు బికినీ వేసుకొని ఉండగా, అందులో ఆమె బేబీ బంప్ లుక్‌తో కనిపించింది. దీంతో ఆమె ప్రగ్నెంట్ అనే వార్తలు మరింత ఊపందుకున్నాయి. అంతేకాకుండా, ఆమె ఒక సందర్భంలో డ్రింక్ కోసం గ్లాసు పైకెత్తినప్పుడు వైన్ కాకుండా నీరు త్రాగడంతో అనుమానాలు బలపడ్డాయి. దీంతో నెటిజన్స్ కొన్ని క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి కాకుండానే తల్లి అయిందంటూ తెగ ప్రచారాలు చేస్తున్నారు. అయితే అమీషా పటేల్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. గతంలో ఆమె నిర్వాన్ బిర్లాతో డేటింగ్ చేస్తోందనే వార్తలు వచ్చిన దానిపై స్పందించింది లేదు. ఇక తెలుగులో అమీషా పటేల్ బద్రి, నాని లాంటి చిత్రాల్లో నటించింది.