ఇటీవలే స్టార్ హీరోయిన్ నిత్యమీనన్ (Nithya Menen) తన ఫాలోవర్లు, అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉండేందుకు సొంతంగా యూట్యూబ్ ఛానల్‌ను లాంఛ్ చేసిన విషయం తెలిసిందే.
నిత్య అన్ ఫిల్టర్డ్ (Nithya Unfiltered) పేరుతో యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టింది. సినీ ఇండస్ట్రీలో తన 12 ఏళ్ల ప్రయాణానికి సంబంధించిన విషయాలతో తొలి వీడియోను పోస్ట్ చేయగా..మంచి స్పందన వస్తోంది. కాగా ఇపుడు ఈ భామ రూట్లో మరో బ్యూటీ కూడా చేరిపోయింది.
ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా..? విశ్వక్ సేన్‌తో కలిసి త్వరలోనే అశోక వనంలో అర్జుణ కల్యాణం సినిమాలో మెరవబోతుంది రుక్సార్ థిల్లాన్ (Rukshar Dhillon) . మే 6న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఖమ్మంలో రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగబోతుంది. ఈ నేపథ్యంలో రుక్సార్ సొంతంగా యూబ్యూట్ ఛానల్ లాంఛ్ చేసింది. సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు యూట్యూబ్ ఛానల్లో కొన్ని షార్ట్స్ వీడియోలకు కూడా పోస్ట్చేసింది.
YouTube channel live
Subscribe now!!💥♥️https://t.co/nUwN4z26J2 pic.twitter.com/5UOs5tZJwC— Rukshar Dhillon (@RuksharDhillon) May 1, 2022
విశ్వక్ సేన్ సినిమా తర్వాత పలు చిత్రాలను లైన్లో పెట్టబోతుంది రుక్సార్. మరి ఈ సినిమా రుక్సార్ కు ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి. ఓ పాటకు హమ్ చేస్తున్న వీడియోతోపాటు సినిమా ప్రమోషన్స్ కు సంబంధించిన వీడియోను షేర్ చేయగా..నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.